ఆమనగల్ వద్ద ఘోర ప్రమాదం.. ఢీకొన్న మిల్క్ ట్యాంకర్, టెంపో

రిపోర్టర్: Abdul Azeem స్థలం: ఆమనగల్

ఆమనగల్ చౌరస్తా వద్ద నిజామాబాద్ నుంచి శ్రీశైలం వెళ్తున్న టెంపో ట్రావెలర్ను, మిల్క్ ట్యాంకర్ అతివేగంగా వచ్చి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో టెంపోలో ప్రయాణిస్తున్న నలుగురికి తీవ్ర రక్త గాయాలు, మరో తొమ్మిది మందికి స్వల్ప గాయాలయ్యాయి.

సమాచారం అందుకున్న ఆమనగల్ పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. ట్యాంకర్ డ్రైవర్ కల్లి భాస్కర్ రెడ్డి నిర్లక్ష్యంగా వాహనం నడపడం వల్లే ప్రమాదం జరిగిందని గుర్తించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.