కృష్ణలంక సాయికృష్ణ మృతి కేసులో వెలుగులోకి సంచలన నిజాలు

రిపోర్టర్: వెంకట్ స్థలం: అమరావతి

కృష్ణలంక పోలీసుల కస్టడీలో తీవ్ర గాయాలపాలై మృతి చెందిన సాయికృష్ణ ఉదంతంలో సంచలన నిజాలు వెలుగులోకి వచ్చాయి. ఎవరి కంట పడకూడదనే ఉద్దేశంతో నిందితులు అతడిని కృష్ణలంక నెహ్రూనగర్‌లోని ఎన్‌హెచ్‌ఏఐ పాత భవనంలో మరణించే వరకు ఉంచారు. మే 12న సాయికృష్ణ మరణించగా, అర్ధరాత్రి దాటిన తర్వాత హెడ్‌కానిస్టేబుళ్లు అశోక్‌, నాని మృతదేహాన్ని బైక్‌పై శ్మశాన వాటికకు తరలించి రహస్యంగా దహనం చేశారు. సురేష్‌ రిమాండ్‌ రిపోర్టు ద్వారా ఈ దారుణ విషయాలు బయటపడ్డాయి.