దర్శకత్వం వైపు అడుగులు: త్వరలో మెగా ఫోన్ పట్టనున్న హిమేష్

రిపోర్టర్: శివ స్థలం: Mumbai

త్వరలో తానే స్వయంగా దర్శకత్వం వహించనున్నట్లు ప్రముఖ సంగీత దర్శకుడు, నటుడు హిమేష్ వెల్లడించారు. బాలీవుడ్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, తన దర్శకత్వ తొలి సినిమాకు సంబంధించిన స్క్రిప్టులు ఇప్పటికే సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. సంగీతంతో పాటు భవిష్యత్తులో సూపర్ స్టార్ నటుడిగా పేరు తెచ్చుకోవడమే తన లక్ష్యమని, అమితాబ్ బచ్చన్ తరహాలోనే తన పదమూడో సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొడతానని ఆయన ధీమా వ్యక్తం చేశారు.