వీరనారి చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహణ
రిపోర్టర్: ఎన్ రవిందర్ రెడ్డి
స్థలం: ఆత్మకూరు(ఎం)
యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు(ఎం)మండల కేంద్రంలో వీరనారి చాకలి ఐలమ్మ 131వ జయంతి వేడుకలను రజక సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. అంగడి ప్రదేశంలోని ఐలమ్మ విగ్రహానికి రజక సంఘం అధ్యక్షులు పైల ప్రశాంత్ పూలమాల వేసి నివాళులర్పించారు. భూమి కోసం, భుక్తి కోసం, వెట్టిచాకిరి విముక్తి కోసం ఆమె చేసిన పోరాట స్ఫూర్తిని ఈ సందర్భంగా నాయకులు కొనియాడారు.