అధికారుల తీరుపై సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం

రిపోర్టర్: వెంకట్ స్థలం: అమరావతి

అమరావతి సచివాలయంలో జరిగిన కలెక్టర్ల సదస్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారుల పనితీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఫైళ్ల క్లియరెన్స్‌లో ఆలస్యాన్ని తప్పుపడుతూ, గైర్హాజరైన అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రాబోయే నెల రోజుల్లోగా అన్ని ప్రభుత్వ శాఖలు వంద శాతం ఆన్‌లైన్ ద్వారానే ఫైళ్ల నిర్వహణ చేపట్టాలని స్పష్టమైన గడువు విధించారు.