అంబేద్కర్ భవనం నిర్మాణ పనులు తక్షణమే ప్రారంభించాలి: అధికారులను హెచ్చరించిన దళిత సంఘాలు

రిపోర్టర్: Alfa News Desk స్థలం: రామకుప్పం

సామగుట్టపల్లిలో అంబేద్కర్ భవన స్థలాన్ని ఎమ్మార్పీఎస్, బహుజన సేన నాయకులు సర్వేయర్లతో కలిసి పరిశీలించారు. భవన నిర్మాణ పనుల్లో జరుగుతున్న జాప్యంపై ఎమ్మార్పీఎస్ చిత్తూరు జిల్లా మాజీ అధ్యక్షులు ఎం.పి. ప్రకాష్ మాదిగ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మౌలిక వసతులతో భవనాన్ని వెంటనే నిర్మించాలని మున్సిపల్ కమిషనర్ను డిమాండ్ చేశారు. నిర్లక్ష్యం చేస్తే ప్రజా ఉద్యమం చేపడతామని హెచ్చరించారు.