బొబ్బిలిలో ఘనంగా పోషణ మాసోత్సవాలు.. తల్లీ బిడ్డల ఆరోగ్యంపై అవగాహన!

రిపోర్టర్: Bobbili GANESH స్థలం: బొబ్బిలి

విజయనగరం జిల్లా బొబ్బిలి మండలం కలవరాయి గ్రామంలోని అంగన్వాడీ కేంద్రంలో పోషణ మాసోత్సవాలను ఐసీడీఎస్ సీడీపీఓ విజయలక్ష్మి బుధవారం ప్రారంభించారు. సెప్టెంబర్ 9 నుండి అక్టోబర్ 8వ తేదీ వరకు జరిగే ఈ వేడుకల్లో భాగంగా తల్లులకు పౌష్టికాహారం, ఆరోగ్యం, బాలల వికాసంపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో సెక్టార్ సూపర్వైజర్లు ప్రభావతి, రామకుమారి, రాజు, శుభలక్ష్మి, మహిళా పోలీసులు, ఆరోగ్య సిబ్బంది మరియు తల్లులు పాల్గొన్నారు.