పశ్చిమ బెంగాల్ ఇంటర్మీడియట్ సెమిస్టర్ మూడు పరీక్షల షెడ్యూల్ విడుదల

రిపోర్టర్: శివ స్థలం: West Bengal

పశ్చిమ బెంగాల్ హయ్యర్ సెకండరీ ఎడ్యుకేషన్ కౌన్సిల్ 2027 సంవత్సరానికి సంబంధించిన 12వ తరగతి సెమిస్టర్ మూడు బోర్డు పరీక్షల టైమ్‌టేబుల్‌ను విడుదల చేసింది. ఈ పరీక్షలు సెప్టెంబర్ 21వ తేదీన ప్రారంభమై అక్టోబర్ 14వ తేదీ వరకు కొనసాగుతాయని కౌన్సిల్ అధికారులు వెల్లడించారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు.