రాజస్థాన్ లో ఘోర విద్యుత్ ప్రమాదం: రోడ్డు పనుల్ లో ఎనిమిది మంది కార్మికులు మృతి
రిపోర్టర్: కృష్ణ
స్థలం: ఝున్ఝును
రాజస్థాన్ లోని ఝున్ఝును జిల్లాలో జరిగిన ఘోర విద్యుత్ ప్రమాదంలో ఎనిమిది మంది కార్మికులు మృతి చెందారని పోలీసులు తెలిపారు. ఛపోలి గ్రామంలో రోడ్డు నిర్మాణ పనులు చేస్తుండగా భారీ యంత్రం హైటెన్షన్ విద్యుత్ తీగను తాకడంతో ఈ విషాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.