ఎన్నికల సంఘం తీరుకు నిరసనగా కలెక్టరేట్ వద్ద ధర్నా

రిపోర్టర్: GANESH BBL స్థలం: బొబ్బిలి

కేంద్ర ఎన్నికల సంఘం తీరును నిరసిస్తూ ఈ నెల 30న విజయనగరం జిల్లా కలెక్టరేట్ వద్ద భారీ నిరసన కార్యక్రమం నిర్వహించనున్నట్లు కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి మువ్వల శ్రీనివాసరావు తెలిపారు. దొంగ ఓట్లు, ఈవీఎం ట్యాంపరింగ్ ద్వారా ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఈ ధర్నా కార్యక్రమానికి కాంగ్రెస్ శ్రేణులు, ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని మువ్వల పిలుపునిచ్చారు.