చిట్వేల్ పాఠశాల కూలిన ప్రహరీ గోడ పునర్నిర్మాణంలో నిర్లక్ష్యం

రిపోర్టర్: k. siva prasad స్థలం: చిట్వేల్

చిట్వేల్ జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో వర్షాకాలంలో కూలిన ప్రహరీ గోడను ఏడాది గడిచినా అధికారులు పునర్నిర్మించలేదు. కూలిన గోడకు ఆనుకుని ఉన్న ఇతర గోడలు కూడా బలహీనంగా ఉండటంతో విద్యార్థుల భద్రతపై తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. మరో వర్షాకాలం సమీపిస్తున్న తరుణంలో, ప్రమాదం జరగకముందే అధికారులు స్పందించి తక్షణమే మరమ్మతులు చేపట్టాలని స్థానికులు, విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. పాఠశాల ఆవరణలో నిత్యం విద్యార్థుల రాకపోకలు ఉండటంతో భద్రతా చర్యల పట్ల నిర్లక్ష్యం వహించవద్దని వారు కోరుతున్నారు.