పాకిస్థాన్‌కు షాక్ ఇచ్చిన సౌదీ అరేబియా ఇజ్రాయెల్‌తో చేతులు

రిపోర్టర్: విజయ్ స్థలం: World

హౌతీ తిరుగుబాటుదారుల దాడుల నేపథ్యంలో మిత్రదేశం పాకిస్థాన్ సహకరించకపోవడంతో సౌదీ అరేబియా కీలక నిర్ణయం తీసుకుంది. భద్రతా సవాళ్లను ఎదుర్కొనేందుకు శత్రు దేశమైన ఇజ్రాయెల్‌తో చేతులు కలిపేందుకు సిద్ధమైంది. అమెరికా సెంట్రల్ కమాండ్ మధ్యవర్తిత్వంలో ఇజ్రాయెల్ అధికారులతో సౌదీ రహస్య చర్చలు జరిపింది. మిడిల్ ఈస్ట్‌లో మారుతున్న ఈ రాజకీయ సమీకరణాలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.