నాగవారిగూడెంలో డ్రైనేజీ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతామన్న సర్పంచ్ సౌజన్య
రిపోర్టర్: KOLA MAHESH
స్థలం: నారాయణపురం
యాదాద్రి భువనగిరి జిల్లా నారాయణపురం మండలంలోని నాగవారిగూడెంలో నెలకొన్న డ్రైనేజీ సమస్యపై గ్రామ ప్రజలు సర్పంచ్ సుర్వి సౌజన్య రాజుకు విన్నవించారు. వెంటనే స్పందించిన ఆమె గ్రామాన్ని సందర్శించి పారిశుద్ధ్య లోపాలను స్వయంగా పరిశీలించారు. వీధుల్లో పేరుకుపోయిన మురుగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు కేంద్ర ప్రభుత్వ పథకం ద్వారా కమ్యూనిటీ కాంపోస్ట్ పిట్ నిర్మిస్తామని గ్రామస్తులకు హామీ ఇచ్చారు.