ఏపీలో పరిశ్రమల ఏర్పాటుపై నారా లోకేష్ కీలక చర్చలు
రిపోర్టర్: సునీల్
స్థలం: Amaravati
ఎన్.ఎ.ఎన్. గ్రీన్ మెట్ వ్యవస్థాపకులు నవీన్ అగర్వాల్ తో మంత్రి నారా లోకేష్ సమావేశమయ్యారు. ఆంధ్రప్రదేశ్ లో కంపెనీ పెట్టుబడులు, క్లీన్ ఎనర్జీ, క్రిటికల్ మినరల్స్ మరియు అడ్వాన్స్ డ్ మ్యానుఫ్యాక్చరింగ్ రంగాల్లో వస్తున్న నూతన అవకాశాలపై ఇరువురు చర్చించారు. పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన అనుకూల వాతావరణాన్ని కల్పిస్తామని లోకేష్ తెలిపారు.