విజయనగరం జిల్లాలో పాముకాటుతో మహిళా రైతు మృతి
రిపోర్టర్: వెంకట్
స్థలం: విజయనగరం
విజయనగరం జిల్లా జామి మండలం వెంకటరాజుపాలెంలో పొలంలో పని చేస్తుండగా పాముకాటు గురైన మహిళా రైతు రమణమ్మ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. శుక్రవారం సాయంత్రం వరి పొలంలో గాబు తీస్తుండగా ప్రమాదవశాత్తూ పాము కాటు వేయడంతో కుటుంబ సభ్యులు ఆమెను వెంటనే జామి పీహెచ్‌సీకి, అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం విజయనగరం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ శనివారం తెల్లవారుజామున ఆమె ప్రాణాలు కోల్పోయింది. భర్త శ్రీను ఇచ్చిన ఫిర్యాదు మేరకు జామి ఎస్సై జనార్ధన్‌రావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.