ఇండోర్ లో దిల్జిత్ దోసాంజ్ కచేరీపై ఆంక్షలు: నాలుగు పాటలు బ్యాన్

రిపోర్టర్: రమేష్ స్థలం: ఇండోర్

పంజాబీ గాయకుడు దిల్జిత్ దోసాంజ్ ఇండోర్ లో నిర్వహించనున్న సంగీత కచేరీలో నాలుగు పాటలను ప్రదర్శించడానికి వీళ్లేదని అధికారులు శనివారం స్పష్టం చేశారు. మద్యం మరియు హింసను ప్రోత్సహించే పాటలు చిన్నారులపై చెడు ప్రభావం చూపుతాయని జిల్లా బాలల పరిరక్షణ అధికారి తెలిపారు. చండీగఢ్ కు చెందిన డాక్టర్ పుండిత్ర్ ధారేనావర్ చేసిన ఫిర్యాదు మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. ఈ ఆంక్షలు తీవ్ర చర్చకు దారితీశాయి.