గర్భిణీలు పౌష్టికాహారం తీసుకోవాలని సర్పంచ్ వెంకటయ్య పిలుపు

రిపోర్టర్: విజయ్ స్థలం: నల్గొండ

చింతపల్లి మండల పరిధిలోని గోడకొండ్ల గ్రామ పంచాయతీలో అంగన్‌వాడీ కేంద్రం ఆధ్వర్యంలో పోషణ మాసం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కాశగోని వెంకటయ్య పాల్గొని గర్భిణీలు, బాలింతలు పౌష్టికాహారం తీసుకోవడం వల్ల తల్లీ బిడ్డ ఆరోగ్యంగా ఉంటారని సూచించారు. అనంతరం ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో చిన్నారులకు టీకాలు వేశారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి మురళి, అంగన్‌వాడీ టీచర్లు, ఏఎన్ఎం, ఆశా వర్కర్లు పాల్గొన్నారు.