పంటలు వేయొద్దని రైతులను హెచ్చరించిన మంత్రి వాకిటి శ్రీహరి

రిపోర్టర్: సురేష్ స్థలం: Telangana

డ్యాంలలో తాగునీటికే ఇబ్బందులు ఉన్నందున రైతులు పంటలు వేసుకోవద్దని మంత్రి వాకిటి శ్రీహరి స్పష్టం చేశారు. రైతులను రెచ్చగొట్టడం వల్లే జూరాల ప్రాజెక్టు తాళాలు పగలగొట్టే పరిస్థితి వచ్చిందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో సాగునీటి విడుదల కష్టమని, రైతులు అప్రమత్తంగా ఉండి ఇబ్బందులు పడకూడదని మంత్రి స్పష్టం చేశారు.