'భారీ స్కోర్లు సాధించే మెంటాలిటీ పెంచుకోవాలి': రషీద్ ఖాన్ కీలక వ్యాఖ్యలు

రిపోర్టర్: కిరణ్ స్థలం: భారతదేశం

భారత్‌తో జరుగుతున్న వన్డే సిరీస్ ద్వారా ఆఫ్ఘనిస్తాన్ జట్టు పవర్‌ప్లేలో బ్యాటింగ్, బౌలింగ్‌ విభాగాలపై ప్రత్యేక దృష్టి సారించి మెరుగవ్వాల్సిన అవసరం ఉందని ఆ జట్టు స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్ స్పష్టం చేశారు. ఢిల్లీ వేదికగా భారత్‌తో జరిగే ఆఖరి వన్డేకు ముందు ఆయన టైమ్స్ ఆఫ్ ఇండియాకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, ఎలాంటి పరిస్థితుల్లోనైనా పెద్ద స్కోర్లు సాధించే మానసిక దృఢత్వాన్ని యువ ఆటగాళ్లు అలవర్చుకోవాలని, భారత యువ ఆటగాళ్లు అభిషేక్ శర్మ, వైభవ్ సూర్యవంశీ ప్రతిభ అద్భుతమని కొనియాడారు.