పల్నాడులో ముమ్మర తనిఖీలు: ఎన్నికల వేళ సరిహద్దుల వద్ద నిఘా పటిష్టం
రిపోర్టర్: శ్రీనివాస్
స్థలం: పల్నాడు
ఎన్నికల వేళ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పల్నాడు జిల్లా ఎస్పీ శ్రీ జగదీష్ ఆదహళ్లి, IPS ఆదేశాల మేరకు పొందుగల అంతర్రాష్ట్ర చెక్పోస్ట్ వద్ద పోలీసులు ముమ్మరంగా వాహన తనిఖీలు నిర్వహిస్తున్నట్లు పల్నాడు పోలీస్ వెల్లడించారు. అక్రమ నగదు మరియు మద్యం రవాణాపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామని, ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించడమే తమ ప్రధాన లక్ష్యమని ఈ సందర్భంగా స్పష్టం చేయడం జరిగింది.