సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా ముగ్గురు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తుల నియామకం

రిపోర్టర్: కృష్ణ స్థలం: తెలంగాణ

సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా ముగ్గురు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులకు పదోన్నతి కల్పిస్తూ కొలీజియం సిఫార్సు చేసినట్లు అధికారులు వెల్లడించారు. ఈ జాబితాలో తెలంగాణ హైకోర్టు సీజే జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్తో పాటు గుజరాత్ సీజే జస్టిస్ సునీతా అగర్వాల్, ఢిల్లీ సీజే జస్టిస్ దేవేంద్ర కుమార్ ఉపాధ్యాయ పేర్లు ఉన్నాయని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ పరిశీలన అనంతరం రాష్ట్రపతి ఆమోదంతో త్వరలోనే వీరు సర్వోన్నత న్యాయస్థానంలో బాధ్యతలు స్వీకరించనున్నారని అధికారులు పేర్కొన్నారు.