నిరుద్యోగులకు గుడ్ న్యూస్: ఎనిమిది వేలకు పైగా ఉపాధ్యాయ పోస్టుల నియామకం
రిపోర్టర్: నరేష్
స్థలం: Gandhinagar
గుజరాత్ లో ఎనిమిది వేలకు పైగా నూతన విద్యా సహాయకుల నియామక పత్రాలను ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ అందజేశారు. వికసిత భారత్ నిర్మాణంలో ఉపాధ్యాయులు కీలక పాత్ర పోషిస్తారని ఆయన పేర్కొన్నారు. అదలజ్ లోని త్రిమందిర్ లో జరిగిన ఈ కార్యక్రమంలో విద్యానిర్వహణ అధికారులతో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. మహిళా అభ్యర్థులు అధిక సంఖ్యలో ఎంపిక కావడం నారీ శక్తికి నిదర్శనమని ముఖ్యమంత్రి వెల్లడించారు.