నెల్లూరు జిల్లా ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో పనిచేయని మంచినీటి యంత్రాలు

రిపోర్టర్: కృష్ణ స్థలం: నెల్లూరు

నెల్లూరు జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో తాగునీటి సమస్య తీవ్రంగా వేధిస్తోంది. లక్షలు వెచ్చించి ఏర్పాటు చేసిన శుద్ధజల యంత్రాలు నిర్వహణ లేక మూలకు చేరడంతో విద్యార్థులు తాగునీటికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పలుచోట్ల దాతలు, అధ్యాపకుల సహకారంతో వాటర్ క్యాన్లు కొనుగోలు చేసి విద్యార్థుల దాహార్తి తీరుస్తుండగా, అధికారులు స్పందించి మరమ్మతులు చేయించాలని విద్యార్థులు కోరుతున్నారు.