పెందుర్తిలో జనసేన పార్టీ ఆత్మీయ సమావేశం నిర్వహణ
రిపోర్టర్: గోపి
స్థలం: అనకాపల్లి
అనకాపల్లి జిల్లా పెందుర్తి నియోజకవర్గం సుజాతనగర్లోని దాట్ల మాన్సెన్స్ కల్యాణ మండపంలో స్థానిక సంస్థల ఎన్నికల సమాచార సేకరణ సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో జనసేన పార్టీ ఆత్మీయ సమావేశం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో పంచకర్ల రమేష్ బాబుతో పాటు పెందుర్తి నియోజకవర్గ జన సైనికులు, పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొని భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు.