పాఠశాలలో భయానక ఘటన: పదో తరగతి విద్యార్థినిపై రంపంతో ఉన్మాది దాడి

రిపోర్టర్: నరేష్ స్థలం: Anantapur

అనంతపురం జిల్లా రాప్తాడు మండలంలోని ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి విద్యార్థినిపై దుండగుడు రంపంతో దాడి చేసినట్లు తరగతి గదిలో ఉన్న ఉపాధ్యాయురాలు కన్నీటిపర్యంతమవుతూ తెలిపారు. మ్యాథ్స్ క్లాస్ చెబుతుండగా హఠాత్తుగా లోపలికి వచ్చిన వ్యక్తి దారుణానికి పాల్పడ్డాడని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. కళ్ల ముందే జరిగిన ఈ ఘటనతో తాను తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యానని పేర్కొంటూ, పాఠశాలలో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయని ఉపాధ్యాయులు వెల్లడించారు.