ఆప్టిమస్ గ్రూప్‌తో తయారీ భాగస్వామ్యాన్ని విస్తరించిన నథింగ్ సంస్థ

రిపోర్టర్: వెంకట్ స్థలం: భారతదేశం

టెక్ దిగ్గజం నథింగ్ సంస్థ ఆప్టిమస్ గ్రూప్‌తో తన వ్యూహాత్మక తయారీ సంయుక్త వెంచర్‌ను విస్తరిస్తున్నట్లు మంగళవారం ప్రకటించింది. నథింగ్ మరియు సీఎంఎఫ్ స్మార్ట్‌ఫోన్‌ల తయారీ, యాజమాన్యం, పరిశోధన అభివృద్ధిని ఒకే భారతీయ సంస్థ కిందకు తీసుకురావడానికి ఈ నిర్ణయం తీసుకున్నారు. అలాగే నథింగ్ తదుపరి సిరీస్ ఏ ఫండింగ్ రౌండ్‌లో ఆప్టిమస్ గ్రూప్ పాల్గొని, కార్ల్ పీ నేతృత్వంలోని ఈ సంస్థలో తన వాటాను మరింత పెంచుకోనుంది.