నా జోలికి వస్తే సహించేది లేదంటూ మేకపాటి విక్రమ్రెడ్డిపై మంత్రి ఆనం ఫైర్

రిపోర్టర్: నరేష్ స్థలం: నెల్లూరు

ఆత్మకూరు మాజీ ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్రెడ్డి నియోజకవర్గంలో రౌడీయిజానికి పాల్పడుతున్నారని మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. వైఎస్సార్సీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి ఆదేశాలతో అరాచకాలు సృష్టించేందుకు కుట్రలు పన్నుతున్నారని ఆయన మండిపడ్డారు. బెదిరింపులకు భయపడే ప్రసక్తే లేదని స్పష్టం చేస్తూ, రాజకీయంగా తనను లక్ష్యంగా చేసుకుని ఇబ్బందులకు గురిచేస్తే ఉపేక్షించబోమని హెచ్చరించారు.