కేంద్ర ప్రభుత్వంపై రాహుల్ గాంధీ ధ్వజం: ఏడాదిలోపే కూలిపోతుందంటూ సంచలన వ్యాఖ్యలు

రిపోర్టర్: కిరణ్ స్థలం: సంగ్రూర్

కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటనపై లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పంజాబ్ లోని సంగ్రూర్ లో నిర్వహించిన ఇన్సాఫ్ ర్యాలీలో ఆయన మాట్లాడుతూ, ఏడాది లోపే కేంద్ర ప్రభుత్వం కూలిపోతుందని సంచలన జోస్యం చెప్పారు. గుజరాత్ అదానీ పోర్టులో డ్రగ్స్ పట్టుబడిన ఘటనపై ఏం చర్యలు తీసుకున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. దేశంలో శాంతిభద్రతల గురించి మాట్లాడే నైతిక హక్ కు అమిత్ షాకు లేదని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు.