వరంగల్ ఎయిర్ పోర్ట్ పేరుపై సీఎం రేవంత్ రెడ్డికి సందీప్ రెడ్డి వంగా సూచనలు
రిపోర్టర్: గోపి
స్థలం: వరంగల్
వరంగల్ లో అంతర్జాతీయ విమానాశ్రయం ఏర్పాటు కావడంపై హర్షం వ్యక్తం చేస్తూ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా దానికి రుద్రమ లేదా కాకతీయ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ అని పేరు పెట్టాలని సూచించారు. ఆయన సూచనపై సీఎం రేవంత్ రెడ్డి ఎక్స్ వేదికగా దట్స్ ది స్పిరిట్ అంటూ స్పందించగా, తన సినిమాలోని డైలాగ్ సీఎం నోట రావడం ఆనందంగా ఉందని సందీప్ రెడ్డి పేర్కొన్నారు.