పోక్సో కేసులో సంచలన తీర్పు: ఇరవై ఏళ్ల కఠిన కారాగార శిక్ష

రిపోర్టర్: శివ స్థలం: మేడ్చల్ మల్కాజిగిరి

మహిళలు మరియు చిన్నారుల రక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని Cyberabad Police వెల్లడించారు. మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన పోక్సో కేసులో కీలా ధర్మారావు అనే నిందితుడి నేరం రుజువు కావడంతో న్యాయస్థానం ఇరవై ఏళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు వెయ్యి రూపాయల జరిమానా విధిస్తూ సంచలన తీర్పు వెలువడించిందని అధికారులు స్పష్టం చేశారు. బాధితులకు తగిన న్యాయం జరిగేలా పోలీసులు పకడ్బందీగా దర్యాప్తు పూర్తి చేసి కోర్టులో బలమైన సాక్ష్యాధారాలు సమర్పించినట్లు తెలిపారు.