ఉద్యోగులకు గుడ్ న్యూస్: రాష్ట్రంలో ఉపాధ్యాయ పోస్టుల కేటాయింపు ప్రక్రియ పూర్తి
రిపోర్టర్: అశోక్
స్థలం: అమరావతి
రాష్ట్రపతి ఉత్తర్వులు-2025 ప్రకారం ప్రభుత్వ ఉపాధ్యాయులు, ఉద్యోగుల కేటాయింపు ప్రక్రియపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు ఆర్థిక శాఖ వెల్లడించింది. నూతనంగా ఏర్పాటైన ఇరవై ఆరు జిల్లాలు, ఆరు జోన్లు, మల్టీ జోన్ల పరిధిలో సిబ్బంది పోస్టులను సర్దుబాటు చేశామని అధికారులు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం లక్షా ఎది ఆరు వేలకు పైగా పోస్టులు ఉండగా, ప్రస్తుతం లక్షా అరవై వేల మందికి పైగా పనిచేస్తున్నట్లు పేర్కొన్నారు.