రైతుల ఆందోళనకు మద్దతుగా వెళ్తున్న బీజేపీ నేతల అరెస్ట్

రిపోర్టర్: ప్రవీణ్ స్థలం: తెలంగాణ

జూరాల ప్రాజెక్టులో నీళ్లున్నా దిగువకు విడుదల చేయకపోవడంతో రైతుల పంటలు ఎండిపోతున్నాయి. ఈ సమస్యపై ఆందోళన చేస్తున్న రైతన్నలకు మద్దతుగా వెళ్తున్న తెలంగాణ బీజేపీ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. రైతుల పక్షాన పోరాడుతున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షులను అరెస్ట్ చేయడంపై పార్టీ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను తక్షణమే ఎండగడతామని హెచ్చరించాయి.