కుప్పంలో పరిశ్రమల అభివృద్ధికి సంపూర్ణ మద్దతునిస్తామన్న కూటమి సర్కార్
రిపోర్టర్: శ్రీనివాస్
స్థలం: కుప్పం
కుప్పం నియోజకవర్గంలో సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు పూర్తి సహకారం అందిస్తామని తెలుగు దేశం పార్టీ ప్రకటించింది. కొలేటరల్ భారం లేకుండా వేగంగా రుణాలు, ప్రోత్సాహకాలు కల్పించి వేలాది మంది యువతను ఎంటర్ప్రెన్యూర్లుగా తీర్చిదిద్దే బాధ్యతను కూటమి ప్రభుత్వం తీసుకుంటుందని స్పష్టం చేసింది. ఈ మేరకు స్థానిక పారిశ్రామిక రంగానికి పెద్దపీట వేసేలా కీలక చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు.