రోడ్డు తనిఖీలో మంత్రి ప్రవేశ్ వర్మపై చెంపదెబ్బ ఆరోపణలు
రిపోర్టర్: రాము
స్థలం: New Delhi
ఢిల్లీలో రోడ్డు తనిఖీ సందర్భంగా మంత్రి ప్రవేశ్ వర్మ తనను చెంపదెబ్బ కొట్టారంటూ సాహెబ్ సింగ్ అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు అధికారులు తెలిపారు. తిలక్ నగర్ ప్రాంతంలో కొత్త రోడ్డును పరిశీలిస్తున్న సమయంలో ఈ ఘటన జరిగినట్లు బాధితుడు ఆరోపించారు. వీడియో రికార్డు చేస్తుండగా మంత్రి తన ఫోన్ లాక్కుని దాడి చేశారని పేర్కొన్నారు. అయితే ఈ ఆరోపణలను మంత్రి వర్మ ఖండించగా, వైరల్ అవుతున్న వీడియోలో పూర్తి సందర్భం లేదని స్పష్టం చేశారు.