రూపాయలు యాభై లక్షలతో నూతన రైతు బజార్కు ఎమ్మెల్యే శంకుస్థాపన

రిపోర్టర్: Dinesh Panda స్థలం: పలాస

శ్రీకాకుళం జిల్లా పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలో రూ. 49.30 లక్షలతో నూతనంగా నిర్మించనున్న రైతు బజార్కు పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష శంకుస్థాపన చేశారు. మూడున్నర నెలల్లోనే పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తెస్తామని ఈ సందర్భంగా ఆమె వెల్లడించారు. గత ప్రభుత్వం అభివృద్ధిని విస్మరించిందని ఆరోపించారు.