పోలింగ్ వేళ ఉద్రిక్తత: వైఎస్సార్, పల్నాడులో వైకాపా టీడీపీ వర్గాల ఘర్షణ
రిపోర్టర్: విజయ్
స్థలం: Amaravati
ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల పోలింగ్ లో పలు ప్రాంతాల్ లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయని పోలీసులు వెల్లడించారు. కడప, పార్వతీపురం మన్యం, పల్నాడు జిల్లాల్ లో వైకాపా, టీడీపీ వర్గాల మధ్య ఘర్షణలు చెలరేగి దాడులు జరగడంతో ఓటర్లు భయాందోళనకు గురయ్యారు. పెద్దముడియం, భామిని, ముప్పాళ్ల మండలాల్ లో ఇరువర్గాలు రాళ్లు, కర్రలతో పరస్పరం దాడి చేసుకున్నాయని, ముగ్గురు టీడీపీ కార్యకర్తలు తీవ్రంగా గాయపడ్డారని అధికారులు పేర్కొన్నారు.