ఏపీ భాజపా ఇన్ఛార్జిగా అరవింద్ బదోరియా నియామకం

రిపోర్టర్: రాజేష్ స్థలం: దిల్లీ

భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ ఇన్ఛార్జిగా మధ్యప్రదేశ్ మాజీ మంత్రి అరవింద్ బదోరియాను నియమిస్తూ హైకమాండ్ నిర్ణయం తీసుకుంది. సహ ఇన్ఛార్జిగా తమిళనాడు మాజీ ఎమ్మెల్యే వానతి శ్రీనివాసన్ నియామకమయ్యారు. ఈ మేరకు పార్టీ జాతీయ నాయకత్వం వివరాలను వెల్లడించింది. అలాగే భాజపా జాతీయ ఉపాధ్యక్షురాలిగా ఉన్న ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరిని ఒడిశా ఇన్ఛార్జిగా రెండోసారి నియమించారు. రామ్మాధవ్ను తమిళనాడు, ఉత్తరాఖండ్లకు ఇన్ఛార్జులుగా బాధ్యతలు అప్పగించారు.