మాదాపూర్లో విషాదం: ప్రియుడికి వీడియో కాల్ చేసి సాఫ్ట్వేర్ ఉద్యోగిని ఆత్మహత్య

రిపోర్టర్: సతీష్ స్థలం: హైదరాబాద్

మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. తనను పెళ్లి చేసుకోవాలని కోరుతూ ప్రియుడికి వీడియో కాల్ చేసిన సాఫ్ట్వేర్ ఉద్యోగిని అర్చనాచౌదరి మాలిక్ బలవన్మరణానికి పాల్పడినట్లు ఇన్స్పెక్టర్ కేవీ సుబ్బారావు తెలిపారు. ఉత్తర్ప్రదేశ్కు చెందిన అర్చన, వివాహితుడైన సహోద్యోగి భండారి విమల్ గత కొంతకాలంగా సన్నిహితంగా ఉంటున్నారు. శనివారం అర్ధరాత్రి వీడియో కాల్లో హెచ్చరించిన ఆమె, విమల్ వచ్చేసరికే ప్రాణాలు కోల్పోయినట్లు పోలీసులు వెల్లడించారు.