అస్సాంలో అదాని పవర్ ప్లాంట్‌కు ముఖ్యమంత్రి శర్మ శంకుస్థాపన
రిపోర్టర్: హరి
స్థలం: అస్సాం
అస్సాంలోని ధుబ్రి జిల్లా చాపార్లో రూ.48,000 కోట్ల వ్యయంతో చేపట్టనున్న 3,200 మెగావాట్ల అదాని పవర్ ప్లాంట్‌కు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ ఆదివారం శంకుస్థాపన చేశారు. రాష్ట్ర చరిత్రలోనే ఇది అతిపెద్ద ప్రైవేట్ పెట్టుబడి అని, ఈ ప్రాజెక్టు ద్వారా వేలాది మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని సీఎం తెలిపారు. ఈ కార్యక్రమంలో అదాని గ్రూప్ డైరెక్టర్ జీత్ అదానితో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.