బాపట్ల జిల్లా వ్యాప్తంగా ఉత్సాహంగా స్వచ్ఛాంధ్ర కార్యక్రమం
రిపోర్టర్: అశోక్
స్థలం: బాపట్ల
బాపట్ల జిల్లాలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా జిల్లా ఎస్పీ బి. ఉమామహేశ్వర్ ఆదేశాల మేరకు పోలీస్ అధికారులు విస్తృత పరిశుభ్రత కార్యక్రమాలు చేపట్టారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న పోలీస్ స్టేషన్లు మరియు కార్యాలయాలలో అధికారులు, సిబ్బంది స్వయంగా శ్రమి పరిసరాలను శుభ్రం చేశారు. ప్రజలకు పరిశుభ్రతపై అవగాహన కల్పిస్తూ ఆదర్శంగా నిలిచారు.