ఫ్యాటీ లివర్ సమస్య తీవ్రతపై వైద్య నిపుణుల కీలక హెచ్చరికలు

రిపోర్టర్: గోపి స్థలం: హెన్నూర్

ఫ్యాటీ లివర్ వ్యాధి ప్రతి ఒక్కరిలో భిన్నంగా ఉంటుందని, దీని తీవ్రతను ముందుగానే అంచనా వేయడం సాధ్యం కాదని స్పర్శ్ హాస్పిటల్ సీనియర్ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ తెలిపారు. కాలేయంలో కొవ్వు చేరడం అనేది కేవలం ఒక సాధారణ సమస్య కాదని, దీనివల్ల డయాబెటిస్, ఇన్సులిన్ నిరోధకత, కార్డియో మెటబాలిక్ వంటి ప్రమాదాలు పెరుగుతాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. సమస్యను బట్టి ఎప్పటికప్పుడు పరీక్షలు చేయించుకుని తగిన చికిత్స పొందాలని నిపుణులు సూచిస్తున్నారు.