శ్వేతసౌధంలో అత్యాధునిక డ్రోన్పోర్టు ఏర్పాటుపై ట్రంప్ సంచలన ప్రకటన

రిపోర్టర్: కిరణ్ స్థలం: Washington

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వైట్ హౌస్ స్వరూపాన్ని మార్చేసే కీలక నిర్ణయం తీసుకున్నారు. శ్వేతసౌధంలో నిర్మిస్తున్న బాల్రూమ్పై క్షిపణులు ప్రయోగించగల అత్యాధునిక డ్రోన్పోర్టు ఏర్పాటు చేయనున్నట్లు ఆయన ప్రకటించారు. 18 ఎకరాల్లో విస్తరించిన శ్వేతసౌధాన్ని శత్రుదాడుల నుంచి రక్షించేందుకు ఈ చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు. అయితే ఈ ప్రతిపాదనపై భద్రతా నిపుణులు పలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ రద్దీ ప్రాంతంలో దీని నిర్వహణ సవాల్గా మారుతుందని హెచ్చరిస్తున్నారు.