తిమ్మాపురం దళితవాడలో మౌలిక వసతుల కరువు: తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్న స్థానికులు

రిపోర్టర్: శివ స్థలం: నేరేడుగొమ్ము

నేరేడుగొమ్ము మండలం తిమ్మాపురం గ్రామంలోని దళితవాడలో నూటయాభై సంవత్సరాలుగా మౌలిక వసతులు కరువయ్యాయని స్థానికులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. సీసీ రోడ్లు లేక, తాగునీరు లీకై బజార్లు బురదమయంగా మారాయని వారు వాపోయారు. వీధిలైట్లు లేక చీకటి అలుముకోవడంతో పాటు పాముల భయం వెంటాడుతోందని ప్రజలు తెలిపారు. అధికారులు స్పందించి తక్షణమే సమస్యలను పరిష్కరించాలని కోరారు.