హుజూర్నగర్లో నూతన స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేసిన ఉత్తమ్ కుమార్ రెడ్డి

రిపోర్టర్: శ్రీనివాస్ స్థలం: సూర్యాపేట

సూర్యాపేట జిల్లా హుజూర్నగర్లో నిర్వహించిన బహిరంగ సభలో రాష్ట్ర నీటిపారుదల మరియు పౌరసరఫరాల శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి నూతన స్మార్ట్ రేషన్ కార్డులను అర్హులైన లబ్ధిదారులకు పంపిణీ చేశారని ఆల్ఫా న్యూస్ ప్రతినిధి తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా లబ్ధిదారులను ఉద్దేశించి మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజా సంక్షేమ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ప్రభుత్వ ఫలాలు అందేలా పారదర్శక విధానాలతో చర్యలు తీసుకుంటున్నామని ఆయన ఈ సందర్భంగా స్పష్టం చేశారు.