మదనపల్లెలో నకిలీ భూముల దందా: లేడీ డాన్ సులోచన అరెస్ట్
రిపోర్టర్: శ్రీనివాస్
స్థలం: మదనపల్లె
మదనపల్లెకు చెందిన లేడీ డాన్, రౌడీషీటర్ కోనేటి సులోచనతో పాటు మరో ఇద్దరిని అరెస్టు చేసి రిమాండుకు తరలించినట్లు రెండో పట్టణ ఎస్ఐ నాగేశ్వర్రావు తెలిపారు. నకిలీ పత్రాలతో భూములను కాజేస్తున్నారన్న ఫిర్యాదు మేరకు సులోచన, ఆమె అనుచరుడు మోహన్, రియల్టర్ శ్రీరాములు నాయుడులను పీటీ వారెంట్ పై అరెస్టు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ కేసులో మరో ఎనిమిది మందిని అదుపులోకి తీసుకోవాల్సి ఉందని వెల్లడించారు.