అనంతసాగరం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం: కారును ఢీకొన్న ట్రాక్టర్, ఇద్దరు దుర్మరణం

రిపోర్టర్: నరేష్ స్థలం: அనంతసాగరం

అనంతసాగరం మండలం యాకర్లపాడు వద్ద కారు అదుపుతప్పి ఎదురుగా వస్తున్న ట్రాక్టర్ను ఢీకొన్న ఘటనలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. శ్రీశైలం యాత్రకు బయలుదేరిన కారు టైరు పగలడంతో ఈ ప్రమాదం జరిగినట్లు ఎస్సై రాజేష్ వెల్లడించారు. ఈ ఘోర ప్రమాదంలో దాసరి రాజశేఖర్ అక్కడికక్కడే మృతి చెందగా, తీవ్రంగా గాయపడిన పువ్వల సుజాత ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. మరో ఘటనలో ఆత్మకూరులో బాలకృష్ణ అనే వ్యక్తి కూడా రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు.