ప్రాణదాతగా నిలిచిన రక్తదాతకు అరుదైన సత్కార గౌరవం
రిపోర్టర్: Dinesh Panda
స్థలం: పలాస
శ్రీకాకుళం జిల్లా పలాసలో రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో పలుమార్లు రక్తదానం చేసి ప్రాణదాతగా నిలిచిన మల్లేశ్వరరావు గారిని ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో ముఖ్య అతిథులు మల్లేశ్వరరావు చేస్తున్న సేవలను కొనియాడారు. రక్తదానం చేయడం వల్ల ఎంతో మంది ప్రాణాలు కాపాడవచ్చని, యువత ఆయనను ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. అనంతరం మల్లేశ్వరరావు గారికి శాలువా కప్పి, జ్ఞాపిక అందజేసి సత్కరించారు. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ సొసైటీ సభ్యులు, ప్రముఖులు, స్థానికులు పాల్గొన్నారు.