వీరనారి చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తి తెలంగాణ సమాజానికి నిత్య ప్రేరణ.. డాక్టర్ గోగుల రాణా ప్రతాప్ రెడ్డి
రిపోర్టర్: Rajashekar
స్థలం: నర్సంపేట
నర్సంపేటలోని భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో వీరనారి చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా ఆమె చిత్రపటానికి బీజేపీ వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ గోగుల రాణా ప్రతాప్ రెడ్డి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అణచివేతకు ఎదురు నిలిచి, బడుగు బలహీన వర్గాల హక్కుల కోసం ఐలమ్మ సాగించిన పోరాటం చరిత్రాత్మకమని కొనియాడారు. నేటి యువత ఆమె పోరాట పటిమను ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ జూలూరు రోజా రాణి, గూడూరు సందీప్, తనుగుల అంబేద్కర్, జూలూరు మనీష్ గౌడ్, తాళ్లపెల్లి రాము తదితరులు పాల్గొన్నారు.