గ్రీన్ సిటీలో కూటమి నేతల ఆత్మీయ సమావేశం

రిపోర్టర్: santhoshkumar స్థలం: గాజువాక

విశాఖపట్నం జిల్లా గాజువాక నియోజకవర్గం 88వ వార్డు పరిధిలోని యాదవ జగరాజుపేట గ్రీన్ సిటీ ఫంక్షన్ హాల్లో బుధవారం ఉదయం 9 గంటలకు కూటమి పార్టీల ఆత్మీయ సమావేశం జరగనుంది. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, స్థానిక శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావు అధ్యక్షతన ఈ సమావేశం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో జనసేన ఇన్చార్జ్ కోన తాతారావు, బీజేపీ ఇన్చార్జ్ కర్ణం రెడ్డి నరసింహారావుతో పాటు కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని నిర్వాహకులు కోరారు.