బంగారం ధర తగ్గుతున్నా దేశీయ మార్కెట్లో కొనుగోళ్లు నిల్
రిపోర్టర్: గోపి
స్థలం: న్యూఢిల్లీ
దేశంలో బంగారం ధరలు తగ్గుతున్నప్పటికీ మార్కెట్లో కొనుగోళ్లు ఆశించిన స్థాయిలో లేవని ఎంఎంటీసీ-పీఏఎంపీ అధిపతి సమిత్ గుహా తెలిపారు. ధరలు మరింత తగ్గే అవకాశం ఉందన్న అంచనాతో బడా జువెలరీ సంస్థలు ఆచితూచి అడుగులు వేస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. పండుగ సీజన్ అయినప్పటికీ పెద్ద ఎత్తున బంగారాన్ని కొనుగోలు చేయడానికి నగల వ్యాపారులు వెనకడుగు వేస్తున్నారని వెల్లడించారు.